క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్‌లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట,కడుపులో పూతలు తగ్గుతాయి. కాబట్టి కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం త్రాగితే ప్రయోజనం ఉంటుంది. క్యాబేజీని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాక కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. క్యాబేజిలో ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉండడం వలన కడుపు మంటను తగ్గించటంలో సహాయపడుతుంది. క్యాబేజిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయపడి ఫ్రీరాడికల్స్‌ను నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ మధ్య చేసిన పరిశోధనల్లో క్యాబేజీలో అల్జీమర్స్‌ని నిరోధించే లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు పరిశోధకులు. అయితే ఈ లక్షణాలు రెడ్ క్యాబేజీలో మాత్రమే ఉన్నాయి. అల్జీమర్స్ సమస్యను నివారించే విటమిన్ K రెడ్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంటుంది.
Sale!
Cabbage ( క్యాబేజీ ) ( సుమారు 400 to 600 గ్రాములు)
Original price was: ₹45.00.₹40.00Current price is: ₹40.00.
Reviews
There are no reviews yet.