బీట్‌రూట్ చేసే మేలు అంతా ఇంతా కాదు. పండ్లలో యాపిల్ ఎంత పవర్ ఫుల్‌గా పనిచేస్తుందో. కూరగాయల్లో బీట్‌రూట్ అంత కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజూ బీట్‌రూట్ తింటే.. అనారోగ్యాన్ని బీట్ చేస్తారు. బరువు తగ్గాలన్నా, రక్తహీనత, గుండె సమస్యలను దూరం చేయాలన్నా.. బీట్‌రూట్ తప్పకుండా తినాల్సిందే. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలకు బీట్‌రూట్ ఎంతో మంచిదట. గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుందట. బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా పుడుతుందట.
Reviews
There are no reviews yet.