బత్తాయి పండులో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యునటీ పవర్ పెరుగుతుంది. అయితే ఈ పండుతో వచ్చే రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బత్తాయి పండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బత్తాయి పండు రసం తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో 90 శాతం నీరు ఉంటుంది. ఈ పండులో ఎక్కువగా ఫైబర్, కొవ్వు , పొటాషియం, విటమిన్-సి అధికంగా లభిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండు తీసుకోవడం చాలా మంచిదిబత్తాయి పండు రసం తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ క్రమంగా జరుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెంచడంలోను కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యం ఉంచడంలో ఎంతో మేలు చేస్తుంది. . బత్తాయి పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతుంది. బత్తాయి పండును గర్భిణీలు తీసుకోవడం వల్ల పండులోని క్యాల్షియం కడుపులో పెరిగే బిడ్డకు, తల్లికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా బత్తాయి రసంలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రొసర్టీస్ వల్ల కంటి చూపు మెరుగ కనిపిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బత్తాయిలోని విటమిన్ సి వల్ల శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి.
Reviews
There are no reviews yet.