వేసవికాలం అనగానే మనకు పచ్చకాయలే గుర్తొస్తాయి. ఈ సీజన్లో ఎర్రగా నిగనిగలాడే.. పుచ్చపండ్లు మార్కెట్లో సందడి చేస్తూ ఉంటాయి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలను తిని దాహం తీర్చుకోవడం మామూలే. చూడగానే నోరూరే పుచ్చకాయ తింటే.. ఎండవేడి తగ్గి రీఫ్రెష్ అవ్వడమే కాదు.. ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్-ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.పుచ్చకాయలో పొటాషియం మెండుగా ఉంటుంది.. పొటాషియం యూరిన్ ఎక్కువ వచ్చేలా చేస్తుంది. దీంతో హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది. పుచ్చకాయలోని లైకోపేన్ గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రం సరిగా రానపుడు, మూత్రం మంటగా అనిపించినపుడు పుచ్చకాయ తింటే మేలు చేస్తుంది.
Sale!
పుచ్చ కాయ (Warermelon) ఒక్క కిలో
Original price was: ₹30.00.₹25.00Current price is: ₹25.00.
Reviews
There are no reviews yet.