పండ్లలో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మనం నీరసంగా ఉన్నప్పుడు, జ్వరం, ఏమైనా శస్త్ర చికిత్సలు, గర్భిణీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాం. అయితే వీటిని అలాంటప్పుడే కాకుండా రోజువారి మన ఆహారాల్లో ఒకటిగా చేర్చుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. చాలా మందికి దానిమ్మ కాయలు అంటే చాలా ఇష్టం. అయితే వాటిని వొలుచుకుని తినడానికి బద్ధకం. దానిమ్మ కాయల్లో చాలా పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. దానిమ్మ పండ్లలో క్యాల్షియం, జింక్, పొటాషియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి, సి, ఇ, కె, యాంటీ ఆక్సిడెంట్స్..రాత్రి సమయంలో దానిమ్మ కాయల జ్యూస్ తాగడం వల్ల మరింత మేలు కలుగుతుంది. ఎముకలకు సంబంధించి సమస్యలతో బాధపడేవారు ఈ జ్యూస్ లో ఒక టీ స్పూన్ అల్లం రసం వేసి కలుపుకోవాలి. ఈ జ్యూస్ ను రాత్రి పూట పడుకోవడానికి అరగంట ముందు తాగితే.. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.
నిద్రలేమి సమస్యలు ఉండవు:
ఒక కప్పు దానిమ్మ గింజల్లో కొంచెం పెరుగు కలుపుకుని రాత్రి పడుకునే ముందు తింటే.. నిద్రలేమి సమస్యలు తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది:
రాత్రి పూట దానిమ్మ గింజలను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
పగలైనా, రాత్రి అయినా దానిమ్మపండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలతో పోటీ పడే శక్తి లభిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యంగా:
క్రమం తప్పకుండా దానిమ్మ కాయలను తింటూ ఉంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే జుట్టు కూడా ఒత్తుగా, అందంగా ఉంటుంది.
జీర్ణ శక్తి పెరుగుతుంది:
దానిమ్మ గింజలను తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగు పరచడంలో సహాయపడుతుంది. మలబద్ధం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే వీటిని జ్యూస్ కన్నా.. తింటేనే అందులో ఉండే ఫైబర్ శరీరానికి అందుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Reviews
There are no reviews yet.