వేసవిలో నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఇందులో అనేక రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. వేసవి కాలంలో ముఖ్యంగా కర్బూజ తినడం, జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఇది రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్బూజాలో నీరు, పీచు పుష్కలంగా ఉంటుంది. వేసవిలో ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేస్తుంది. దీంతోపాటు ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మీరు వేసవిలో కర్బూజతో చేసిన జ్యూస్ కూడా తీసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం.రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కర్బూజ జ్యూస్ లో బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ విటమిన్ ఎగా మారి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: కర్బూజ ఫలం ఫోలేట్‌కి మంచి మూలం. దీనిని విటమిన్ బి-9 అని కూడా అంటారు. ఇది కొన్ని క్యాన్సర్ల ప్రమాదం నుంచి కూడా రక్షిస్తుంది.
హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: కర్బూజ కాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. దీనిని తినడం వల్ల రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు, తల తిరగడం, తలనొప్పి, మలబద్ధకం, పొడి చర్మం మొదలైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కావున దీనిని తినడం మంచిది.
సమృద్ధిగా విటమిన్లు, ఖనిజాలు: కర్బూజ కాయలో విటమిన్ కె, నియాసిన్, కోలిన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం మొదలైన అనేక విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: దోస జాతికి చెందిన కర్బూజ కాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
Reviews
There are no reviews yet.