కంటి చూపు బాగుండేందుకు తోడ్పడే విటమిన్ ఏ పుదీనాలో బాగా లభిస్తున్నందున దీనిని మీరోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* పుదీనాలో ఉండే యాంటాక్సైడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి. ఇతర ఆకులు, మూలికల కంటే ఈ విషయంలో ఇది బాగా పనిచేస్తుంది.
* పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి ఐబీఎస్ అనే సమస్య ఏర్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అకస్మాత్తుగా నొప్పితో విరేచనం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పుదీనా మంచి ఉపశమనంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పచ్చి పుదీనా ఆకు కంటే పుదీనా ఆయిల్ ఉండే క్యాప్సూల్స్ బాగా పనిచేస్తాయని ఆ అధ్యయనాల్లో తేలింది.
Reviews
There are no reviews yet.