వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడుని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చెట్లకు గుత్తుల్లా కాచే ఈ కూరగాయ తినడానికి కొంతమంది ఇష్టపడితే, మరికొంత మంది అంతగా పట్టించుకోరు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిదికార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి 100 గ్రాముల గోరుచిక్కుడులో 35 కేలరీలు మాత్రమే ఉంటాయి.
వీటితో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, నీరు, ఫైబర్, చక్కెర, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎలు ఉంటాయి.వీటిని తీసుకోవడం వల్ల బాహ్య, అంతర్గత పుండ్లు తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లని దూరం చేసి మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు.. ఎన్నో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి సాల్మొనెల్లో సహా బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇది సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లప దాడి చేసి నాశనం చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.
Reviews
There are no reviews yet.