దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? వేసవిలో దాహం తీర్చేది మాత్రమే కాదిది. దీని ఇతర ఉపయోగాలు తెలుసుకోండి.దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఈ ఖనిజ లవణాలు శరీరానికి చాలా అవసరం. దోసకాయ వల్ల శరీరానికి ఎలాంటి మేలు చేస్తుందో చూద్దాంజీవక్రియను పెంచుతుంది: శరీరంలోి జీవక్రియను పెంచడంలో దోసకాయ సహాయపడుతుంది. క్రమం తప్పకుండా దోసకాయ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది: దోసకాయలో సిలికా వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. సిలికా ఎముక నిర్మాణాన్ని బలపరుస్తుంది. క్రమం తప్పకుండా దోసకాయ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: దోసకాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఈ రెండు పదార్థాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల దోసకాయ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువును అదుపులో ఉంచుతుంది: దోసకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. కాబట్టి దోసకాయ బరువు తగ్గడానికి పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా దోసకాయను ఆహారంలో చేర్చుకోవాలి.
Sale!
దోసకాయ (Cucumber) 500 గ్రాములు
Original price was: ₹40.00.₹30.00Current price is: ₹30.00.
Weight | 0.5 kg |
---|
Reviews
There are no reviews yet.