గడప గడప కు ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి కి ప్రజల నుండి అపూర్వ స్పందన
నంద్యాల (mananandyala.com) 12 మే: నంద్యాల పట్టణంలోని ఆరో వార్డు లో రెండవ రోజు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి శ్రీకారం చుట్టారు వార్డు ప్రజల నుండి ఎమ్మెల్యేకు అపూర్వ స్పందన లభించింది అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ ఎక్కడికక్కడ సమస్యలను తెలుసుకొని అందుకుచర్యలు తీసుకున్నామన్నారు అలాగే తెలుగుదేశం నాయకులు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రజల్లో వస్తున్న స్పందన చూసి వణుకు మొదలైందని ప్రజల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రజాదరణ ఎక్కడ ఇసుమంతైనా తగ్గలేదని అందుకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను కుల మత వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలియజేశారు.