ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పవన్ కల్యాణ్
నంద్యాల (మన నంద్యాల) ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు మేకల నాగ సుబ్బారాయుడు కుటుంబాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆ రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. పవన్ కల్యాణ్ కు రైతు కుటుంబ సభ్యులు తమ సమస్యల గురించి చెప్పుకున్నారు. కౌలు రైతులకు తమ జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. పవన్ వెంట పలువురు స్థానిక జనసేన నేతలు ఉన్నారు.