నంద్యాల లో స్పందన-ఎస్పీ
నంద్యాల లో సోమవారం “స్పందన” కార్యక్రమం నంద్యాల జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ సమస్యల పరిష్కరం కోసం అర్జీలు అందజేయాలని అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు.