పిన్నాపురం గ్రామ ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని కోరితే అరెస్టు చేయడం దుర్మార్గం
పిన్నాపురం గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నాలుగవంతులు నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో పిన్నాపురం గ్రామ పర్యటనకు వెళ్లేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గారు వస్తున్నారని తెలియడంతో పట్టణంలోని సిపిఎం పార్టీ నాయకులందరినీ అరెస్టు చేయడం దుర్మార్గమని, ఈ కార్యక్రమంలో భాగంగా సిఐటి అధ్యక్షులు లక్ష్మణ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అవుకు లక్ష్మన్న లను వేకువజామున అరెస్టు చేయడం దుర్మార్గమని వీలైతే పిన్నాపురం గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,పిన్నాపురం గ్రామం ప్రజల యొక్క కష్టాలను బాధలను తెలుసుకునే హక్కు కూడా లేదంటే ఇంకా ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందా పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థల కోసమా,అధికార పార్టీ నాయకులకు లాభాలు చేకూర్చడం కోసం పనిచేస్తుందో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు, పిన్నాపురం గ్రామ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు