ఎస్ నాగులవరం గ్రామంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి హారతులతో స్వాగతం పలికిన మహిళలు.
నంద్యాల (మన నంద్యాల) 26 జూలై: నియోజకవర్గం గోస్పాడు మండలం లోని ఎస్ నాగులవరం గ్రామంలో శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు హారతులతో స్వాగతం పలికారు గ్రామంలో వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను చేయడం జరిగిందని ముఖ్యంగా మంచినీటి సమస్యను శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందనిగ్రామ ప్రజలు తెలిజెశారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గోస్పాడు మండలం లోని ఎస్ నాగులవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గ్రామంలో మంచినీటి సమస్య ఉండటం జరిగిందని ప్రభుత్వం వచ్చిన తర్వాత సిసి రోడ్లు మంచినీటి సమస్యలను పరిష్కరించి అదేవిధంగా గ్రామ ప్రజలు మినరల్ వాటర్ ప్లాంట్ కావాలని అడగడంతో తమ సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల ద్వారా పేద ప్రజలకు గృహాలను ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో ప్రజలందరూ తమ సొంత గృహాలలో ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న ఆశయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి పి మధుసూదన్ రెడ్డి, గ్రామా సర్పంచ్ వంగూరుకాంతమ్మ, వైసీపీ నాయకులు వంగూరు సుధాకర్ రెడ్డి,కుమార్ రెడ్డి,దెవనసతీష్ రెడ్డి,అశోక్ కుమార్ రెడ్డి,దేవనకృష్ణ రెడ్డి, గ్రామ వైసిపి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.