You are currently viewing పది నెలల పాపాయికి రైల్వే జాబ్.. చరిత్రలోనే తొలిసారి

పది నెలల పాపాయికి రైల్వే జాబ్.. చరిత్రలోనే తొలిసారి

  • Post category:nandyal

పది నెలల పాపాయికి రైల్వే జాబ్.. చరిత్రలోనే తొలిసారి

రైల్వే శాఖలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. చరిత్రలోనే తొలిసారి పది నెలల పాపాయికి రైల్వేలో ఉద్యోగాన్ని కల్పించారు. పాప తండ్రి ఓ రైల్వే ఉద్యోగి. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో కారుణ్య నియామకం కింద బాలికకు ఉద్యోగాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఆమెకి 18 ఏళ్లు నిండాక ఈ రైల్వే ఉద్యోగంలో చేరవచ్చు. ఆ మేరకు జీతభత్యాలు అందనున్నాయి. అయితే ఈ ఘటన చరిత్రలోనే తొలిసారని చెప్పవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం.. అందులోనూ రైల్వే పోస్ట్‌ల కోసం ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా కష్టపడుతుంటారు. అయినా సరే ఆ ఉద్యోగం దక్కడం కష్టం. అలాంటిది ఓ పది నెలల పాపాయికి రైల్వే జాబ్ దక్కింది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ అక్షరాల నిజం. చత్తీస్‌గఢ్… రాయ్‌పూర్‌లోని ఆగ్నేయ మధ్య రైల్వేలో అరుదైన కారుణ్య నియామకం జరిగింది. అందులో భాగంగా రైల్వే అధికారులు పది నెలల రాధిక అనే బాలికకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ రిజిస్ట్రేషన్‌‌ను పూర్తి చేశారు. ఈ మేరకు బాలికకు 18 ఏళ్లు వచ్చాక రైల్వే శాఖ ఆ ఉద్యోగాన్ని ఇవ్వనుంది. అయితే ఇలా ఓ పాపాయికి రైల్వే ఉద్యోగాన్ని ఇవ్వడం చరిత్రలోనే తొలిసారిగా వెల్లడించింది.

వాస్తవానికి ఆ బాలిక తండ్రి రాజేంద్ర కుమార్ పీపీ యార్డ్ భిలాయ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. అయితే జూన్ ఒకటో తేదీన రాజేంద్ర, అతని కుటుంబంతో కలసి భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రతో పాటు ఆమె భార్య మంజు యాదవ్ ప్రాణాలు కోల్పోయారు. వారి పాప మాత్రం ప్రమాదం నుంచి బయటపడింది. తండ్రి మరణంతో ఆ బాలికకు రైల్వేలో కారుణ్య నియామకం లభించింది. దానికోసం అధికారులు ఆమె పేరును నమోదు చేశారు. ఈ మేరకు రాధికను ఆమె తాత, మామ బుధవారం రైల్వే ఆఫీసుకు తీసుకెళ్లారు. ఆమె వేలి ముద్రలు తీసుకుని రాధికను ఉద్యోగ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.