You are currently viewing 14వ వార్డు సుద్దుల పేట లో ప్రతి గడప లో వెల్లివిరిసిన ప్రభుత్వ పథకాలు

14వ వార్డు సుద్దుల పేట లో ప్రతి గడప లో వెల్లివిరిసిన ప్రభుత్వ పథకాలు

  • Post category:nandyal

14వ వార్డు సుద్దుల పేట లో ప్రతి గడప లో వెల్లివిరిసిన ప్రభుత్వ పథకాలు

నంద్యాల (మన నంద్యాల ) 14వార్డు సుద్దల పేటలో గడప గడప కు మనప్రభుత్వం కార్యక్రమం వార్డ్ కౌన్సిలర్ విమలమ్మ దూరంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఇంటికి అందే విధంగా సచివాలయ సిబ్బంది మరియు ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా MLA శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 14వ వార్డు సుద్దాల పేటలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి అందుతున్నాయో లేదో తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇంకా ఎవరైనా ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులు ఉంటే వారికి అందించే విధంగా కృషి చేస్తామన్నారు అదేవిధంగా 14వ వార్డులో ముఖ్యంగా మంచినీటి సమస్య ఉండటంతో  అక్కడ ఉన్న ప్రజలు మంచి నీటి ఏర్పాటు చేయాలని తెలియజేయడంతో మోటార్ ద్వారా మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయి లేదో తెలుసుకోవడం కోసమేనని  ప్రభుత్వ పథకాలు ద్వారా ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని టిడిపి నాయకులు మాత్రం లేనిపోని అపోహలు సృష్టిస్తూన్నారు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నా ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం నిన్న కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి ద్వారా 6,500 కోట్ల రూపాయలను తల్లులు అకౌంట్లో వేయడం జరిగింది వైయస్సార్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని నంద్యాల నియోజకవర్గ ప్రజల తరపున జగనన్న కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న మన్నారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ , మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, వార్డు కౌన్సిలర్ విమలమ్మ వైఎస్ఆర్సిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మౌలాలి, మాజీ కౌన్సిలర్ బండి శాంతకుమారి, మజీద్ , ఫాతిమా, శంకర్ గౌడ్, రామ సుబ్బయ్య,  చిప్పగిరి ప్రసాద్, మరియు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్ వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు మరియు మున్సిపల్ అధికారులు సచివాలయ సిబ్బంది వార్డు వాలంటరీ లు పాల్గొన్నారు.